https://www.ntnews.com/TelanganaNew...rabad-airport-expansion-plans-1-2-570269.html
జీఎంఆర్ ఎయిర్*పోర్టు పదేండ్ల్ల ప్రస్థానం
రాజీవ్*గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్*పోర్టు(ఆర్జీఐఏ) దశాబ్దకాలంగా నిరాటంకంగా సేవలు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఘనత సాధించింది.. ఏటా లక్షల మందిని దేశ, హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశాలకు చేరవేస్తూ పలు అంతర్జాతీయఅవార్డులను అందుకున్నది. హైదరాబాద్*తోపాటు, భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తిచేసింది. దేశాభివృద్ధిలో కీలకంగా ఉంటూ జాతీయ స్థూల ఉత్పత్తిలో తనదైన బాధ్యతను నెరవేరుస్తున్నది. శుక్రవారంతో పదేండ్లు పూర్తి చేసుకుంటున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కథనం..
ఇలా మొదలు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపంలో జాయింట్ వెంచర్*లో భాగంగా జీఎంఆర్ గ్రూపు విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో జీఎంఆర్ భాగస్వామ్యం 63 శాతం కాగా, ఎయిర్*పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 13 శాతం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 13 శాతం, మలేషియా ఎయిర్*పోర్టు హోర్డింగ్స్ బెర్*హార్డ్ 11శాతంగా ఉంది. కేవలం 31 నెలల కాలంలోనే జీఎంఆర్ గ్రూపు ఈ ప్రాజెక్టును పూర్తిచేసి రికార్డు సృష్టించింది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్*షిప్ (పీపీపీ) మోడల్*లో దేశంలోనే నిర్మించిన మొట్టమొదటి గ్రీన్*ఫీల్డ్ ఎయిర్*పోర్టుగా ఘనతకెక్కింది. ఇది జీఎంఆర్ గ్రూపు ఏవియేషన్*లో చేపట్టిన మొట్టమొదటి నిర్మాణమైనప్పటికీ ప్రతీ అంశంలోనూ ప్రత్యేకతను చాటింది.
30మిలియన్లు
ఏడాదికి 12 మిలియన్ల మంది ప్రయాణించే సామర్ధ్యంతోపాటు 1.5 మెట్రిక్ టన్నుల కార్గో ట్రాన్స్*పోర్టు కెపాసిటీతో నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రస్తుతం అంచనాకు మించిన డిమాండ్*తో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నది.
2008-2009లో 6.2 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఎయిర్*పోర్టు 2017-18లో 18 మిలియన్ల మందిని చేరవేసి రికార్డులకెక్కింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్*ను దృష్టిలో ఉంచుకుని ఏటా 30 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రారంభించిన మొదట్లో ఇక్కడి నుంచి 28 ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాన్ని అందించిన ఎయిర్*పోర్టు ప్రస్తుతం 9 డొమెస్టిక్,15 విదేశీ, 3 ఇండియన్ కారియర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 60 ప్రాంతాలకు సేవలు అందిస్తున్నది.
దక్షిణ భారతదేశంతోపాటు, సెంట్రల్ ఇండియాకు కూడా ఈ ఎయిర్*పోర్టు హబ్*గా రూపొందనున్నది. ఇండిగో కూడా తమ ప్రైమరీబేస్ ఆపరేషన్స్*కు ఇటీవలే హైదరాబాద్ ఎయిర్*పోర్టును ఎంపికచేసుకుంది. ప్రపంచంలోనే పెద్ద ఎయిర్*క్రాఫ్ట్ ఏఎన్ 225 మ్రియా కూడా ఆర్జీఐ ఎయిర్*పోర్టులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ అయింది.
50 శాతం పెరిగిన వృద్ధిరేటు
2017 నుంచి ఎయిర్*లైన్స్ శ్రీలంకన్, జజీరా ఎయిర్*వేస్ కొత్తగా ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేగాకుండా కొలంబో, వాషింగ్టన్ డీసీ, కువైట్, షార్జా, దోహ తదితర ప్రాంతాలకు ఇక్కడినుంచి సర్వీసులు అందిస్తున్నారు. డొమెస్టిక్ ఆపరేషన్స్*లో భాగంగా మంగళూరు, జబాల్*పూర్, ఛండీఘడ్, త్రివేండ్రం, కడప, నాందేడ్, పాట్నా, సూరత్, గౌహతి, రాంచి, షిర్డీ, విద్యానగర్ (బళ్లారి), పుదుచ్చేరి, నాగ్*పూర్ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచుకుంది. డొమెస్టిక్ ప్రయాణికుల విషయంలో గతంతో పోలిస్తే రాజీవ్*గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్*పోర్టు 50 శాతం వృద్ధిరేటు సాధించింది. ప్యాసింజర్ ఈజ్ ఫ్రైం ప్రోగ్రాం క్రింద ప్యాసింజర్లకు సహాయసహకారాలు అందచేసే వేదిక కూడా ఏర్పాటుచేశారు.
పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి ఊతం
ఆర్జీఐ ఎయిర్*పోర్టు పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి ఊతమిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ వ్యాపార, విద్య, వైద్య, ఫన్*పోర్టు, లాజిస్టిక్ పార్క్ అండ్ ఎరోస్పేస్ పార్క్ అభివృద్ధికి దోహదం చేస్తున్నది. ఏడాదికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల కార్గో సేవలు అందిస్తున్నది. కార్గో సేవల్లో ఫార్మా ఇండస్ట్రీ నుంచే ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయి. వస్తురవాణా చేసే 5 షెడ్యూల్డ్ ఎయిర్*లైన్స్ లుఫ్తానియా, కాథే ఫసిఫిక్, టర్కిష్, కతార్ ఎయిర్*వేస్ అండ్ బ్లూడార్ట్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి. వీటితోపాటు షావగోన్, ఇతిహాడ్ కార్గో, రష్యా, పోలేస్టర్ ఫ్రైటర్స్ కూడా ఇక్కడ నుంచే ఆపరేట్ చేయబడుతున్నాయి. ఇండియాలో ఫ్రీట్రేడ్ జోన్ ఉన్న ఒకే ఒక ఎయిర్*పోర్టుగా ఆర్జీఐకి గుర్తింపు ఉంది. దీనికోసం 19.85 ఎకరాల భూమి కేటాయించి దీనిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
Airport2
పటిష్టమైన భద్రత
అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎయిర్*పోర్టులో పటిష్ఠమైన భద్రత, మెరుగైన ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఎయిర్*పోర్టు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్(ఏఓసీసీ) విధానం ద్వారా ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్*ప్లే సిస్టమ్స్*ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఎండ్ టూ ఎండ్ ఈ-బోర్డింగ్ సొల్యూషన్*తో సెక్యూరిటీ చెకింగ్ లేకుండానే డిపార్చర్ గేట్ ఎంట్రీలోకి వెళ్లొచ్చు.
పర్యావరణంపై ప్రత్యేక దృష్టి
ప్రయాణ సౌకర్యమే గాకుండా పర్యావరణహితంగానూ ఎయిర్*పోర్టను డిజైన్ చేశారు. ఇప్పటికే యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత లీడ్ సర్టిఫికేషన్ పొందింది. శబ్దకాలుష్యం లేకుండా, కర్బన ఉద్గారాలు బయట పర్యావరణానికి చేటు కల్గించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.త్వరలో ఎయిర్*పోర్టులో 100 శాతం ఎల్*ఈడీ బల్బులు ఏర్పాటుచేయనున్నారు. 10 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్*ను ఏర్పాటుచేసుకోవడంతోపాటు, వ్యర్ధపదార్థాలనుంచి కాలుష్యం వెదజల్లకుండా ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని వృధాకాకుండా రేయిన్ వాటర్ హర్వెస్టింగ్ చేస్తున్నారు.
Airport1
అంతర్జాతీయ అవార్డులు సొంతం
ఎయిర్*పోర్టు ప్రారంభమైన 2008లోనే లీడర్*షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్*మెంటల్ డిజైన్(లీడ్) అవార్డును కైవసం చేసుకుంది. డిజైన్, సహజ వెలుగులు, ఇతర పీచర్లకు ఈ అవార్డు లభించింది. ఇంధనం, నీటి వంటి సహజ వనరుల పరిరక్షణకు చేసిన కృషికి సిల్వర్ సర్టిఫికేషన్ పొందింది. 2009లోనే ఆర్జీఐ విమానాశ్రయం ప్రపంచంలోనే నంబర్*వన్ ఎయిర్*పోర్టుగా ప్రకటించబడింది. ఎయిర్*పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేసే ఎయిర్*పోర్టు సర్వీస్ క్వాలిటీలో పదేండ్ల కాలంలో ఆర్జీఐ ఎయిర్*పోర్టు మొదటి మూడుస్థానాల్లోనే కొనసాగుతున్నదంటే ఎంతటి ఉత్తమ సేవలను అందిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.
Airport5
ట్రాన్సిస్ట్ హబ్*గా ఆర్జీఐఏ
జీఎంఆర్ సీఈవో ఎస్*జీకే కిశోర్
వచ్చే 5 నుంచి 10 ఏండ్లలో రాజీవ్*గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ట్రాన్సిస్ట్*హబ్*గా మారుస్తామని జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం సీఈవో ఎస్*జీకే కిషోర్ తెలిపారు. హైదరాబాద్ ద్వారా ఎక్కువ విమానాలు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సంస్కరణల్లో భాగంగా ఈ-బోర్డింగ్ అమలుతోపాటు హ్యాండ్ బ్యాగేజ్ స్లాంపింగ్*ను తీసేసినట్టు వివరించారు. భవిష్యత్తులో పేపర్*లెస్ ట్రావెల్*ను అందిస్తామన్నారు. టికెట్ స్థానంలో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్*ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. దేశంలోనే మొదటి స్మార్ట్ ఆర్జీఐఏను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
దశాబ్ది వేడుకలకు సీఎం కేసీఆర్
Airport3
శంషాబాద్: శంషాబాద్*లోని రాజీవ్*గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పదో వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్*రావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని జీఎంఆర్ కమ్యూనికేషన్ ప్రతినిధివర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం జరిగే ఈ వేడుకల్లో కేంద్ర సివిల్ ఏవియేషన్ సహాయమంత్రి జయంత్*సిన్హా, రాష్ట్రమంత్రులు కేటీఆర్, మహేందర్*రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్*రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్*గౌడ్, కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవ్*చోబే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు కూడా పాల్గొంటారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 3 గంటలకు ఎయిర్*పోర్టులోని హజ్*టర్మినల్*లో వేడుకలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎయిర్*పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు, ఎయిర్*పోర్టు సిటీ లాంచింగ్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్*ను ప్రారంభిస్తారని, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సెంటర్*ను సందర్శిస్తారని ఎయిర్*పోర్టువర్గాలు వెల్లడించాయి.
unquote
news about 10 year celebration and foundation stone for expansion/airport city /convention centre and exhibhition centre.
any one has info about convention centre, is this as big as hitex?